ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత అందరికీ తెలిసిందే. ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళవెంట నీరు పెట్టిస్తుంది వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. అలాగే ఇంకా ఘాటైన సల్ఫర్ గ్యాస్ కూడా బయటకు వచ్చి మనకు కళ్ళ వెంట నీరు తెప్పిస్తుంది. కళ్ళ వెంట నీరు తెప్పించిన ఆరోగ్యానికీ చాలా మంచిది. కొన్ని శతాబ్ధాల నుండి ఉల్లిపాయను ఆహరంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఉల్లిపాయను వంటలో బాగా రుచిని అందిస్తుంది. రుచే కాదు ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.Benefits of Onion.

ఉల్లిపాయ లేకుండా ఎ వంట చేయరు, ప్రతి వంటల్లో ఉల్లిపాయను ఉపయోగిస్తారు. అంత డిమాండ్ ఉల్లిపాయలకు ఉంటుంది. ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, బీహార్, ఉత్తర ప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఉల్లిగడ్డను పండిస్తున్నారు. ఉల్లిపయలను ఉడకబెట్టి తిన్న, పచ్చివి తిన్న, కూరల్లో వేసుకొని తిన్న, ఏలా తిన్న ఆరోగ్యానికీ మంచిదే.
For Health And Beauty Videos Click Here
ఉపయోగాలు:
Benefits of Onion
మధుమేహం కోసం:-
మధుమేహంతో బాధపడేవారు ఉల్లిపాయను తినడం వల్ల చాలా మంచిది. ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
గుండే సమస్యలు కోసం:-
ఉల్లిపాయను తినడం వల్ల రక్తం పల్చగా అయి కణలన్నింటిలోకి రక్తాన్ని పంపిస్తుంది. రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. గుండె సమస్యలు, బీపీ తో బాధపడేవారు రోజు ఉల్లిపాయను తినడం మంచిది.
దగ్గు కోసం:-
ఉల్లిపాయను తీసుకోవడం వల్ల దగ్గుతో నోరు తడి ఆరిపోకుండా చూస్తుంది. ఇంక గొంతులో ఇన్ఫెక్షన్లు పోగొడుతుంది.
ఆర్థరైటిస్ నొప్పి కోసం:-
ఉల్లిల్లో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు ఉండడం వల్ల ఆర్థరైటిస్ నొప్పిని పోగొడుతుంది.
వేడిని తగ్గించడం కోసం:-
శరీరంలో వేడి. ఉంటే ఉల్లిపాయను గుజ్జును మెడకు, పాదాలు రాసుకుంటే చలవ చేస్తుంది.
దంత సమస్యలు కోసం:-
దతాంలో ఉన్న బాక్టీరియా, క్రిములను నాశనం చేయడానికి ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు నమిలితే నోట్లో ఉన్న క్రిములు, బ్యాక్టీరియా చనిపోతాయి పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు అన్నీ పోతాయి.
తేలు, తేనెటీగ కుట్టినప్పుడు:-
తేలు, తేనెటీగ కుట్టినప్పుడు ఉల్లిపాయ రసం రాసుకోవచ్చు. ఉల్లిపాయ రసం కీటక నివారిణిగా ఉపయోగపడుతుంది.
చెవి నొప్పి కోసం:-
చెవి నొప్పి తో బాధపడేవారు ఉల్లి రసాన్ని రెండు చుక్కలు చెవిలో వేసుకోవడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇన్ఫెక్షన్లు కోసం:-
ఉల్లి లో యాంటీ బాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడంవల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు పోతాయి. చిన్న చిన్న గాయాలు నివారించడానికి, బొబ్బలనీ నివారించడానికి కూడా ఉల్లిపాయ బాగా ఉపయోగపడుతుంది. సమస్య ఉన్నచోట ఉల్లిపాయ పేస్ట్ రాసుకోవచ్చు.
పొట్ట నొప్పి కోసం:-
ఉల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడంవల్ల గ్యాస్ట్రో సిండ్రియ సంబంధిత నొప్పులను, కడుపు నొప్పిని పోగొట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ కోసం:-
ఉల్లిపాయలు తినడం వల్ల క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా ఉల్లిపాయ సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఆస్తమా, కామెర్లు కోసం:-
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు ఆస్తమాకు కారణమయ్యే కారకాలు నిలిపివేస్తుంది. అలాగే కామెర్లు కూడా ఉల్లి పాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఉల్లిని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయం చిటికెడు ఉప్పు వేసి తాగిన మంచి ఉపశమనం కలుగుతుంది.
మూత్రకోశ సమస్యలను నివారించడం కోసం:-
మూత్రకోశ సమస్యలన్నింటినీ పోగొట్టుకోవడానికి ఉల్లిపాయలు నీటిలో మరిగించి తాగితే మూత్రంలో మంట, నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది పెరుగు ఉల్లిపాయతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడం కోసం:-
జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడానికి కూడా ఉల్లి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల తిన్నది త్వరగా జీర్ణం అవుతుంది.
రక్తహీనత కోసం:-
రక్తహీనతతో చాలామంది ఈ రోజుల్లో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఉల్లిపాయ, నీరు, బెల్లం తీసుకోవడం వల్ల రక్తహీనతను పోగొట్టుకోవచ్చు. రక్తం అభివృద్ధి చెందుతుంది.
పైల్స్ నివారణ కోసం:-
ఫైల్స్ తో చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఉల్లిపాయ, పంచదార, నీటితో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
మొటిమలు మచ్చలు కోసం:-
ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలు పోగొట్టడానికి ఉల్లిపాయ రసాన్ని, నిమ్మరసంను సమానంగా తీసుకొని మచ్చలు, మోటిమలు ఉన్న చోట అప్లై చేసుకుంటే అవన్నీ కూడా పోతాయి.
లైంగిక శక్తి కోసం:-
ఒక స్పూన్ ఉల్లిపాయ రసాన్ని, ఒక స్పూను అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. సెక్స్ కోరికలు పెంచుతుంది.
గమనిక:- పైన చెప్పిన చిట్కాలు పాటించే ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదించి పాటించండి.
Also Read : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు మరి వెల్లుల్లి చేసే మేలు తెలిస్తే ఏమంటారో..