Benefits of Vaamu (Ajwain).. వామ్ము వల్ల ప్రయోజనాలు ఇన్ని వున్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఇది అందరి వంటింట్లో ఉండే దినుసు. వాము లేదా ఓమా అని పిలుస్తారు.  వాము అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది. మన బామ్మల కాలం నుంచే తిన్నది సరిగ్గా అరగకపోతే వంటింట్లోకి వెళ్లి చిటికెడు వాము నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండేవారంట. ఇప్పుడు మనం తిన్నది సరిగ్గా అరగలేదని చెప్పిన మామ్మలు చెప్పే మొదటి మాట ‘ కొంచెం వామును నమలవే సమస్య పోతుంది అని ‘. వాము అనేది 80% రోగాలను పోగొట్టే ఒక గొప్ప దివ్యౌషధంగా పనిచేస్తుంది. వాము ని మనం కూరల్లో, పకోడీలు, చారులో, రోటిలో ఇలా అన్ని వంటల్లో వాడతాము. ఆరోగ్యానికి మంచిది అలానే రుచి కూడా చాలా బాగుంటుంది.
వాము చూడటానికి చిన్నగా ఉన్నా ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. చాలామందికి వామును వాడటమే తప్ప ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలియవు. కాబట్టి ఇప్పుడు వాములో ఉన్న ఔషధ గుణాలు గురించి తెలుసుకుందాం.Benefits of Vaamu (Ajwain).

For More Videos Click Here

వామును తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు:-

Benefits of Vaamu (Ajwain)

  • వాము వేసి మరిగించిన నీళ్లు తాగుతూ ఉంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.
  • జలుబు, దగ్గు ,తలనొప్పికి వాము ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. వామును లైట్ గా వేయించి వాసన చూస్తే దగ్గు, జలుబు ,తలనొప్పి తగ్గిపోతుంది.
  • వాము లో పీచు పదార్ధాలు, విటమిన్లు ,యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జీర్ణ సమస్యలు పోగొట్టుకోవచ్చు.
  • మలబద్ధకం, గ్యాస్ ,కడుపు ఉబ్బరం అనే సమస్యలతో బాధపడేవారు రాత్రంతా వామును నీటిలో నానబెట్టి ఉదయం వడపోసి తాగితే ఆ సమస్యలు అన్నీ పోతాయి.
  • చాలామంది ఎసిడిటీతో బాధపడుతున్న వారు గొంతులో మంట ,పుల్లటి తేపులు, కడుపులో మంట ఇలా బాధపడేవారు వామును, ఉప్పును నూరి రోజు కొంచెం తీసుకుంటే ఆ సమస్యలన్నిటినీ పోగొట్టుకోవచ్చు.
  • జ్వరంతో బాధపడేవారు వాము, జీలకర్ర, ధనియాలు ఈ మూడిటిని సమానంగా తీసుకుని వేయించి పౌడర్ చేసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపి కషాయం చేసుకుని తాగితే జ్వరం తగ్గుతుంది.
  • నీళ్ళల్లో వామును నానబెట్టి కొంచెం ఉప్పును కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
  • వాము, అల్లం, జీలకర్ర మూడింటిని సమానంగా పొడిచేసి తీసుకుంటే ఆకలి బాగా పెరుగుతుంది.
  • వాముని చప్పరిస్తూ ఉంటే గొంతులో మంట, దురద ,గురగుర శబ్దాలు అన్ని తగ్గుతాయి.
  • గుండె వ్యాధులను నివారించడానికి కూడా వాము బాగా ఉపయోగపడుతుంది.
  • వాము తో తయారు చేసిన నూనె కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • ఆస్తమాతో బాధపడే వారు కూడా వామును తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
  • మూత్ర కోశ సమస్యలు, మూత్రపిండాల్లో ఉండే రాళ్లను పోగొట్టడానికి కూడా వాము బాగా ఉపయోగపడుతుంది.
  • చాలామంది ఆడవారు పీరియడ్స్ సమయంలో నొప్పితో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు వామును దోరగా వేయించి పొడిచేసి నీళ్లలో కలిపి తీసుకుంటే నొప్పి పోతుంది.
  • వాముని వాడడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగి బరువు కూడా తగ్గుతారు.
  • వామును నమలడం వల్ల కడుపులో ఉన్న నులిపురుగులు, ఏలికపాములు అన్నీ కూడా పోతాయి.
  • వెక్కిళ్ల తో బాధపడేవారు వాము నీళ్లు తాగుతూ ఉంటే వెక్కిళ్లు కూడా తగ్గుతాయి.
  • దంత సమస్యలతో బాధపడేవారు వామును, ఉసిరికాయను నూరి సమస్య ఉన్న చోట పెడితే దంత వ్యాధులు కూడా పోతాయి.
  • వామును తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు పాడవకుండా, ఏదైనా కఫం ఉన్న పోగొట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • వాంతులు, వికారాలు తో బాధపడేవారు వామును బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే వాంతులు, వికారాలు తగ్గుతాయి.

Also Read : Soaked Almonds vs Dry Almonds which is Healthy?

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a comment