ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. మనదేశంలో వివిధ ప్రాంతాలలో ఒక్కసారిగా పక్షులు చనిపోతూ ఉండడంతో అది బర్డ్ ఫ్లూ అని దేశవ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి.
వైద్య పరిభాషలో బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లు ఏంజా ( Avian influenza) అని వ్యవహరిస్తారు. నిజానికి బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ఒక సర్వసాధారణమైన వైరస్ వలన వస్తుంది. హెచ్5ఎన్1 వైరస్ వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

ఈ వ్యాధి ఎక్కువగా కోళ్లు,పక్షి జాతులలో కనిపిస్తుంది. ఈ వ్యాధి ఈ పక్షి జాతుల నుండి ఒకదానినుండి ఒకదానికి వ్యాపిస్తోంది. ఈ వ్యాధి సంక్రమించిన పక్షి జాతులలో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి, క్రమంగా వాటి శరీర భాగాలు దెబ్బతిని మరణిస్తాయి.
ఎవరికి వస్తుంది?
ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కోళ్లు, పక్షి జాతుల నుండి మనుషులకు కూడా సంక్రమిస్తుంది, ఈ వైరస్ మొట్టమొదటిసారిగా 1997 సంవత్సరంలో మనుషులలో గుర్తించారు. కానీ బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషుల నుండి మనుషులకు సంక్రమించదు. ఇంతవరకు ఎక్కడా కూడా మనుషులు నుంచి మనుషులకు ఈ వైరస్ సంక్రమించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.
కోళ్లు, పక్షి జాతులకు వచ్చే అన్ని రకాల వైరస్ లు మనుషులకు సంక్రమించవు. కొన్ని అసాధారణ పరిస్థితులలోనే ఈ వైరస్ లు కోళ్లు, పక్షి జాతులు నుంచి మనుషులకు సంక్రమిస్తాయి. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి మానవులకు కూడా కలిగిఉండవచ్చు.
ప్రధానంగా మనుషులకు ఈ వ్యాధి సోకిన పక్షులను, కోళ్లను ప్రత్యక్షంగా తాకడం వలన, ఈ వ్యాధి సోకిన కోళ్లు, పక్షి మాంసం సరిగ్గా ఉడికించకుండా తినటం వలన, వాటి గుడ్లు కూడా సరిగ్గా ఉడకబెట్టకుండా తినటం వలన ఈ వ్యాధి పక్షి జాతుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కువగా పౌల్ట్రీ పరిశ్రమలో పని చేసేవారికి సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు:
symptoms of bird flu
బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన వారిలో తలనొప్పి, డయేరియా, దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్య, జ్వరం, గొంతు నొప్పి కండరాల నొప్పి, ముక్కు కారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి, కొందరికి కంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది.
బర్డ్ ఫ్లూ వ్యాధి వలన మనుషులకు హాని జరగడమే కాకుండా, ఈ వ్యాధి వలన అనేక కోళ్లు, పక్షుల జాతులు చనిపోతున్నాయి. ఈ వ్యాధి వలన అరుదైన అనేక పక్షి జాతులు తగ్గిపోతున్నాయి మరియు అంతరించిపోతున్నాయి.
బర్డ్ ఫ్లూ వలన ముఖ్యంగా కోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది, ఈ వ్యాధి ప్రబలినప్పుడు కోళ్ళ పరిశ్రమలు ఆర్థికంగా నష్టపోతున్నాయి
ఈ వ్యాధి వస్తే ఏం చేయాలి:
ఈ వ్యాధి లక్షణాలు మనలో కనిపించగానే వైద్యులను సంప్రదించాలి. వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే వైద్యుల పర్యవేక్షణలో వైద్యం తీసుకోవాలి అని, ఈ లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యం వహించకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రతలు:
మాంసాన్ని గుడ్లను బాగా ఉడికించి తినాలి, అంతేకాకుండా పెంపుడు పక్షులు కోళ్ళతో ఉండే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ముఖ్యంగా కోళ్ల పరిశ్రమ పని చేసేవారు ఎక్కువగా జాగ్రత్త వహించాలి అని నిపుణులు సూచిస్తున్నారు
symptoms of bird flu
Read : Coronavirus Vaccine Update
Nice
Good information