కంటి కింద ఉన్న నల్లటి వలయాలను మాయం చేసే చిట్కా:
కళ్ళ కింద ఉన్న నలుపుతో బాధపడుతున్నారా? చాలా రకాల చిట్కాలు, క్రీములు వాడిన అవి పోక అలసిపోయారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే… ముఖమంతా అందంగా ఉండి కంటి కింద నలుపు ఉండడంవల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నల్లటి వలయాల తో కళ్ళు ముఖం అందాన్ని పొగుడుతాయి. ఆడ ,మగ ఇద్దరులోని ఈ నల్లటి వలయాలు సమస్య వేధిస్తూనే ఉంది. కంటి కింద నలుపు ని మనం అశ్రద్ధ చేస్తే అది ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వెంటనే పోగొట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు కంటి కింద నలుపు ముడతలు ఎందుకు వస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఏం చేస్తే కంటి కింద నలుపు ముడతలు పోతాయో చూద్దాం..
కంటి కింద నలుపు ఎందుకు వస్తుంది?
సరిగ్గా నిద్ర లేకపోయినా, టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు ఎక్కువ చూసినా ఒత్తిడి, ఆందోళన, వంశపారంపర్యంగా, జీవనశైలిలో మార్పులు, వయసు పైబడిన వారిలో, సూర్యకాంతికి ఎక్స్పోజ్ అవడం వల్ల ఎక్కువగా కంటి కింద నలుపు, ముడతలు రావడానికి కొన్ని ముఖ్య కారణాలు.
కంటి కింద నలుపు రాకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు:-
*టైం కి నిద్ర పోవాలి
*మంచి ఆహారాన్ని తీసుకోవాలి.
*ఒత్తిడి ,టెన్షన్స్ లేకుండా చూసుకోవాలి
*టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్ ఎక్కువగా చూడకూడదు.
కంటి కింద నలుపు పోవడానికి ఒక సింపుల్ చిట్కా:-
ఒక చిన్న గిన్నెలో బాగా పండిన అరటి పండును కొంచెం తీసుకొని మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. అరటిపండు కంటి కింద నలుపుని, మచ్చలను ముడతలను పోగొట్టడనికి బాగా ఉపయోగపడుతుంది. తరువాత దీనిలో ఒక అర టీ స్పూన్ వరకు కాఫీ పొడినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కాఫీ పొడి కూడా ఇనిస్టెంట్ గా కళ్ళ కింద ఉన్న నలుపు ని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే తర్వాత దీనిలో కమలాఫలం తొక్కల పొడి(orange peel powder) ఒక అర టీ స్పూను వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పొడి కూడా కంటి చుట్టూ ఉన్న నలుపు ని, ముడతలను పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన చిట్కా రెడీ అయింది. దీన్ని మీరు పడుకునే గంటముందు కంటి కింద ఉన్న నలుపు దగ్గర అప్లై చేసుకొని ఒక 30 నిమిషాలు ఉంచుకోవాలి. 30 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల కంటి కింద నలుపు, ముడతలు ,మచ్చలు అన్నీ పోతాయి..
Super trip