How to stop Hair fall, జుట్టు ఊడిపోకుండా ఆరోగ్యంగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జుట్టు ఊడిపోతుందని బాధపడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోతుంది. ఆడా,మగా తేడా లేదు. దీనికి ముఖ్య కారణాలు కాలుష్యం వల్ల గాని ఒత్తిడి, టెన్షన్ , పోషకాహర లోపం వల్ల, చుండ్రు ఇలా అనేక రకాల కారణాలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ జుట్టు పొడవుగా నల్లగా ఒత్తుగా పెరగాలనే కోరుకుంటారు. దీని కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి అనేక ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు కానీ వాటిలో కెమికల్స్ కలవడం వల్ల జుట్టు పాడైపోయి మరింత ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. రోజు జుట్టు ఊడిపోవడాని చూసి చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. కాబట్టి జుట్టు ఊడిపోకుండా ఆరోగ్యంగా పెరగాలంటే ఏం చేయాలో చూద్దాం How to stop hair fall. 

జుట్టు ఊడకుండా ఉండాలంటే ఏం చేయాలి? 

  • బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా జుట్టును కవర్ చేసుకోవాలి కాలుష్యం దుమ్ము ధూళి పడకుండా చూసుకోవాలి.
  • చుండ్రు ఎక్కువగా ఉన్న జుట్టు ఊడిపోతుంది కాబట్టి చుండ్రు లేకుండా చూసుకోవాలి.
  • మీరు తల కి వాడే దువ్వెన టవల్ వేరుగా ఉంచుకోవాలి వేరే వాళ్లు వాడేవి వాడకూడదు.
  • విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఉదాహరణకు ఆకుకూరలు, కాయకూరలు, పండ్లు, గుడ్లు ఎక్కువగా తింటూ ఉండాలి.
  • వారంలో రెండు సార్లు తప్పకుండా తల స్నానం చేయాలి దుమ్ము, ధూళి , జిడ్డు లేకుండా జుట్టును శుభ్రం చేసుకోవాలి.
  • తలస్నానం చేసేటప్పుడు బాగా వేడిగా ఉన్న నీళ్లను వాడకూడదు గోరువెచ్చగా ఉన్న నీళ్ళు మాత్రమే వాడాలి.
  • అలాగే తలస్నానం చేసేటప్పుడు, తలకు నూనె పెట్టుకునే టప్పుడు గోర్లతో గికకూడదు వేళ్ళ తో మాత్రమే చేయాలి.
  • కెమికల్స్ ఉన్న షాంపూలను, ప్యాక్ లు ఏమి జుట్టుకి వాడకూడదు.
  • అలాగే తలస్నానం చేశాక జుట్టు నాచురల్ గా ఆరబెట్టుకోవాలి చాలామంది జుట్టు ఆరడానికి హెయిర్ డ్రయర్ ను వాడతారు కానీ హెయిర్ డ్రయార్ను అసలు వాడకూడదు హెయిర్ డ్రయ్యర్ వాడితే జుట్టు వీక్ ఐపోయి ఊడిపోతుంది. కాబట్టి జుట్టు టవల్తో తుడుచుకోవాలి లేదంటే నేచురల్ గానే ఆరబెట్టుకోవాలి.
  • తలస్నానానికి వాడే నీళ్లు కూడా మంచినీరై ఉండాలి.
  • అలాగే తడిగా ఉన్నప్పుడు జుట్టు ని ఎప్పుడు దువ్వ కూడదు. ఆరిన తర్వాత మాత్రమే దువ్వుకోవాలి.
  • జుట్టుకి కండిషనర్ ని వాడాలి అది కూడా నేచురల్ కండీషనర్ అయి ఉండాలి.
  • కనీసం రెండు నెలల కొకసారి అయిన జుట్టు ట్రిమ్మింగ్ చేసుకోవాలి దీనివల్ల జుట్టు చిట్లిపోకుండా పెరుగుతుంది.
How to stop hair fall in telugu
How to stop hair fall

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కొన్ని నేచురల్ టిప్స్:-

  • కొబ్బరి నూనెను రాసేటప్పుడు కొంచెం గిన్నెలోకి తీసుకొని దానిని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు రాసుకుని ఒక ఐదు నుండి పది నిమిషాలు మసాజ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు వేగంగా పెరుగుతుంది.
  • మందార పువ్వులను కొబ్బరి నూనెలో వేసి మరిగించి వడపోసి ఆ నూనెను జుట్టుకు అప్లై చేసుకోవాలి దీని వల్ల కూడా జుట్టు బలంగా అయి వేగంగా పెరుగుతుంది.
  • మనం ఇంట్లో పెంచుకునే కలబందను తీసుకొని కలబంద గుజ్జు తీసి తలకు పట్టించి ఒక 40 నిమిషాల తర్వాత తల స్నానం చేయండి.
  • జుట్టు ఊడిపోవడాని తగ్గించడానికి ఉసిరికాయ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది లేదు అంటే ఉసిరి నైనా పేస్ట్ లాగా చేసుకుని జుట్టుకి అప్లై చేసి తర్వాత నలభై నిమిషాల తర్వాత తల స్నానం చేయండి.
  • మెంతులు కూడా చుండ్రును పోగొట్టి జుట్టుకు కావలసిన శక్తిని అందించి జుట్టు డ్యామేజ్ అవ్వకుండా వేగంగా పెరగడానికి నల్లగా ఒత్తుగా పెరగడానికి మెంతులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మెంతులను రాత్రంతా పెరుగులో కొంచెం నానబెట్టి ఉదయం మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ ను తలకు అప్లై చేసుకొని 40 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.
  • ఉల్లిపాయ రసం కూడా జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు లో చుండ్రును ,ఇన్ఫెక్షన్ పోగొట్టి జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఉల్లిపాయలు మిక్సీలో వేసి పేస్టులాగా చేసి తరువాత వడపోసి ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేసుకొని 40 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.
  • గుడ్డులో తెల్లసొన కూడా జుట్టు వేగంగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. కొంచెం తెల్లసొన, కొంచెం పెరుగు కలిపి తలకు అప్లై చేసుకోండి.
  • అలాగే మెడిటేషన్ కూడా చాలా ముఖ్యమైనది.రోజుకి ఒక గంట అయినా మెడిటేషన్ చేయండి. అప్పుడు జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. మెడిటేషన్ చేస్తే మనసు ప్రశాంతంగా మారి జుట్టు ఉడడం
    తగ్గుతుంది.
  • బియ్యం కొంచెం నీళ్లల్లో రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీళ్ళను తలకు రాసుకుని 40 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.

Also Read : Stress Relief Tips

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a comment