Coconut Milk For Hair

Coconut Milk For Hair | కొబ్బరి పాలు జుట్టుకి అందించే అద్భుత ప్రయోజనాలు

సాధారణంగా ప్రతి అమ్మాయి తన జుట్టు ఒత్తుగా,నల్లగా,అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది జుట్టు ఊడిపోవడం,చిట్లిపోవడం, తెల్ల జుట్టు రావడం ఇలా అనేక రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యలతో ఈ రోజుల్లో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలామంది బాధపడుతున్నారు. దీంతో సమస్యలు నుంచి బయటపడాలని రకరకాల షాంపూలు, క్రీమ్స్, ఆయిల్స్ వాడుతూ ఉంటారు. డబ్బులు ఖర్చు పెట్టి అలా చేయకుండానే జుట్టు సమస్యలను పోగొట్టుకోవచ్చు.
ముఖ్యంగా కొబ్బరిపాలతో చాలా రకాల జుట్టు సమస్యలను పోగొట్టుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Coconut Milk For Hair
Coconut Milk For Hair

*ముందుగా మీరు పచ్చికొబ్బరి తీసుకొని మిక్సీ వేసుకోవడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తరువాత మీరు ఏదైనా ఒక క్లాత్ లో వేసి వడపోసి కొబ్బరి పాలను తీసుకోండి.
*ఇలా తయారుచేసిన పాలను చేతితో అయినా లేదంటే కాటన్తో అయినా డిప్ చేసి తల మొత్తానికి బాగా పట్టించి సున్నితంగా ఒక 5 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత ఒక ఒక గంట తర్వాత మంచి షాంపుతో గాని కుంకుడు కాయలతో గాని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందం..
*ఇలా కొబ్బరి పాలను జుట్టుకు రాయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.
*అంతేకాదు జుట్టు మంచి షైనింగ్ ను అంధిస్తుంది. ఇలా మీరు రెండు, మూడు సార్లు చేస్తూ ఉంటే మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది.
*అంతేకాదు జుట్టు మృదువుగా మారుతుంది.
*అలాగే జుట్టు ఊడిపోవడం, రాలిపోవడం,చిట్లిపోవడం వంటి సమస్యలు పోగొట్టుకోవచ్చు.
*బట్టతలను అరికట్టవచ్చు
*అలాగే జుట్టు లో ఉన్న దురద, చుండ్రు,ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా నివారిస్తుంది.
*జుట్టు కూడా ఒత్తుగా,పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.
చుండ్రు సమస్యను పోగొట్టుకోవడానికి కొబ్బరిపాలను ఇలా వాడండి:-
*ముందుగా మీరు కొబ్బరి పాలెం తయారుచేసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసి రెండింటిని బాగా కలపండి. తర్వాత జుట్టు కుదుళ్ళకు బాగా అప్లై చేయాలి. తర్వాత గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఇలా చేస్తే కచ్చితంగా చుండ్రు సమస్యను పోగొట్టుకోవచ్చు.

Pink lips tip click here

Leave a Comment

Your email address will not be published.