మానవ శరీరం బరువులో 60 శాతం వరకూ నీరు ఉంటుంది. సమస్త మానవ కదలికలకు ఆలోచనలకు మూలాధారమైన మెదడులో కూడా 90% నీరు ఉంటుంది. దీనిని బట్టే మనం మానవ శరీరానికి నీరు ఎంత అవసరమో అనేది అర్థం చేసుకోవచ్చు చాలా మంది నీటిని చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. వారిని మనం ఒక్కసారిగా మీరు రోజుకి ఎన్ని లీటర్ల నీరు త్రాగుతారు అని అడిగితే వారు తెల్లమొహం వేస్తారు. నీటిని తాగే విషయంలో చాలావరకూ అశ్రద్ధగా ఉంటారు. దాహం అయితే తప్పా నీటిని త్రాగరు. ఇంకా చెప్పాలంటే ఆఫీస్ లో ఉండే వారు, స్కూల్స్, కాలేజీలలో లో ఉండే వారు మూత్ర విసర్జన కి ఎక్కువగా వెళ్ళవలసి వస్తుంది అని వారికి దాహం అవుతున్న సరే నీటిని త్రాగకుండా అలానే ఉంటారు. ఇలా చేయడం వల్ల అనేకఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన శరీరంలోని భాగాలు అవి వాటి విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు చాలా అవసరం.
ఒకసారి మీరు రోజుకు ఎంత నీరు తాగుతున్నారో లెక్క పెట్టండి 3 లేదా 4 లీటర్ల నీళ్లు కంటే తక్కువ తాగుతూ ఉంటే మీరు అనారోగ్యాలకు దగ్గర అవుతున్నారని అర్థం. కాబట్టి ఈ రోజు నుండే నీటిని త్రాగడం అలవరచుకోండి ఒకేసారి 4 నుండి 4 లీటర్ల నీరు త్రాగ లేనివాళ్లు ముందు కొంచెంగా ప్రారంభించి క్రమంగా మూడు నుండి నాలుగు లీటర్లు నీరు శరీరానికి అందేలా చూసుకోవచ్చు. తరచుగా చాలా మంది ఉదయం ఒక గ్లాసు నీళ్ళు టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళు, మల్లి సాయంకాలం భోజన సమయంలో దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తీసుకుంటూ ఉంటారు. ఈ అలవాటు ఆరోగ్యాన్ని పాడు చేయడంతోపాటు ఎన్నో రుగ్మతల కు దారి తీస్తుంది.
ఆరోగ్య మరియు సౌందర్య చిట్కాలకోసం క్లిక్ చేయండి.
నీటిని ఎలా తాగాలి?
How much water should we drink a day
శరీరానికి అవసరమైన నీరు తీసుకోవాలి అనే ఆలోచనలో నీటిని ఎలా పడితే అలా త్రాగడం కూడా ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి. నీటిని తాగడానికి సరైన పద్ధతులను పాటించాలి. వాటిలో కొన్ని ముఖ్య పద్ధతులను తెలుసుకుందాం.
ఉదయం లేవగానే లీటరు లేదా లీటరున్నర గోరువెచ్చటి నీటిని పరగడుపున తీసుకోవాలి. ఇది మలవిసర్జన ఫ్రీగా అయ్యేలా చేసి కడుపులో వ్యర్థాలను బయటకు పోయేలా చేస్తోంది.
ఆహారం తీసుకునే గంట ముందు నీటిని త్రాగడం వల్ల జీవక్రియ సంబంధించిన యాసిడ్స్ కడుపులో తయారవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది.
ఆహారం తీసుకున్న అరగంట లేదా గంట తర్వాత మాత్రమే నీటిని తాగాలి. ఆహారం తీసుకున్న తర్వాత గంట సమయం గ్యాప్ ఇచ్చి తర్వాత నీటిని తీసుకోవడం వల్ల ఆ సమయంలో కడుపులో ఉన్న ఆహారం యాసిడ్స్ ద్వారా జీర్ణం అవుతుంది. ఇలా గంట గడిచిన తరువాత నీటిని తీసుకోవడం వల్ల ప్రేగులకు అంటుకున్న ఆహారం, ఇతర పదార్థాలు నీటి ద్వారా శుభ్రపడతాయి. ఉదాహరణకు ఒక వాడుకున్న పాత్రను మనం శుభ్రపరిచి నట్టుగా అని మనము అనుకోవచ్చును. తద్వారా ఎటువంటి గ్యాస్ తయారవకుండా ఎసిడిటీ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.
How much water should we drink a day
నీటిని పై చెప్పిన సమయాల్లో తప్పించి మిగిలిన సమయాల్లో అనగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనానికి మధ్యలో అలాగే మధ్యాహ్నం భోజనానికి మరియు సాయంకాలం స్నాక్స్ కి మధ్యలో, సాయంకాలం నుండి రాత్రి భోజనానికి మధ్యలో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం గా నీటిని త్రాగుతూ రోజుకి శరీరానికి సరిపడా నీరు అందిస్తున్నామో లేదో గమనించుకుంటూ ఉండాలి.
శరీరానికి సరిపడా నీటిని తీసుకోవడం వల్ల లాభాలు:
- మన శరీరంలో ఉన్న వ్యర్ధాలు సులువుగా బయటకు పోతాయి.
- మలబద్ధకం సమస్యలు ఉండవు.
- శరీరంలో 60 శాతం నీరు ఉంటే రక్త ప్రసరణ వ్యవస్థలు, జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తాయి.
- నీటిని సరిపడా త్రాగడం వల్ల కిడ్నీలో రాళ్లను కరిగించడానికి కూడా ఉపయోగపడుతుంది.
- నీటిని సరిగ్గా తీసుకోవడం ద్వారా జీవితకాలమంతా ఆరోగ్యం హాయిగా జీవించవచ్చు
- చర్మ సౌందర్యం పెరిగి కాంతివంతంగా మారుతుంది.
- శరీరానికి కావలసిన ఖనిజ లవణాలు అందుతాయి.
- మూత్ర సంబంధిత వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు.
- రక్తపోటు సమస్యను నియంత్రించుకోవచ్చు.
- శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకుని జ్వరాలకు లోనవ్వకుండా రక్షించుకోవచ్చు.
శరీరానికి సరిపడా నీటిని తీసుకోకపోవడం వల్ల నష్టాలు:
- ఆందోళన, భయం ఉన్నట్లు అనిపిస్తుంది.
- తలనొప్పి, అలసట, నీరసం, నిద్రలేమి, నొప్పులు అంతేకాకుండా నీరు తక్కువ అయితే కాళ్లు చేతులు చల్లబడటం చర్మం పాడైపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
- చెడు శ్వాస వస్తుంది.
- తరచుగా అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటారు.
- అనేక మూత్ర సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.
- చర్మ సమస్యలకు కూడా నీరు తక్కువగా తీసుకోవడం అనేది ముఖ్య కారణం.
- మూత్ర విసర్జన తగ్గి శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవు.
ఇలా అనేక సమస్యలకు లోనవుతారు.
Nice