ఆరోగ్యంగా బరువు తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్.. How to lose weight fast

ఈ రోజుల్లో అధిక శాతం మంది బాధపడుతున్న సమస్య స్థూలకాయం.  కాలక్రమేణా మార్పు చెందిన ఆహారపు అలవాట్ల,  లైఫ్ స్టైల్ వల్ల ఈ సమస్య  తీవ్రంగా పెరుగుతూ పోతుంది.  చిన్నపెద్ద  వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యతో ప్రతి ఒక్కరూ  బాధపడుతున్నారు. మితిమీరిన బరువు తో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.  అరే సమస్య లో పడ్డ మే అని  గుర్తించే లోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా బాధపడే కన్నా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అయినప్పటికీ బరువు పెరిగిన వారికి ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి వీటిని అనుసరిస్తూ ఆహారపు అలవాట్లను, లైఫ్ స్టైల్ ను మార్చుకోవడం ద్వారా మళ్లీ తిరిగి  మునుపటి ఆరోగ్యకర జీవితానికి తిరిగి పొందవచ్చు. how to lose weight fast

       బరువు తగ్గడానికి ఈ రోజుల్లో చాలామంది అనేక రకాలుగా  ప్రయత్నిస్తున్నారు.  సన్నగా, నాజూగ్గా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.  కానీ  ఉన్నఫలంగా అమాంతంగా ఒకేసారి అంత బరువు తగ్గాలని కొందరు అసలు తినడమే పూర్తిగా మానేస్తుంటారు.  దీనివల్ల బరువు తగ్గరు కాక  అనేక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.  కాబట్టి ఇటువంటి దొడ్డి దారులు మానేసి ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవడం చాలా మంచిది. కాకపోతే దీనికి కొంచెం సమయం పడుతుంది.  ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం  ఇన్స్టెంట్ గా వచ్చిన ఫలితాలు ఎంతోకాలం నిలబడవు మీరు షార్ట్ కట్స్ లో బరువు తగ్గించుకున్నా మళ్లీ గోడకు కొట్టిన బంతిలా  తిరిగి అంతే వేగంగా బరువు పెరుగుతారు అనే విషయాన్ని మాత్రం మీరు మరువవద్దు.

            బరువు తగ్గాలి అనుకునే వారు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి అందులో ముఖ్యమైనది వయస్సుకు తగ్గ బరువు తప్పనిసరి. అంతకు మించిన బరువు అనేక ఆరోగ్య సమస్యలకు  దారి తీస్తుంది. ప్రకృతి సిద్ధమైన దారులను అనుసరిస్తూ క్రమంగా బరువు తగ్గాలి.

 

ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఈ క్రింది టిప్స్ ను పాటించవచ్చు:

 •  ప్రతి రోజు ఉదయం లేవగానే లీటరున్నర  గోరు వెచ్చటి నీళ్ళు పరగడుపునే త్రాగాలి.  దీనివల్ల మునుపటి రోజు తీసుకున్న ఆహార వ్యర్థాలు  సుఖ విరోచనం  అయ్యి కడుపులో ఉన్న వ్యర్ధాలు  బయటకు వచ్చేస్తాయి.
 •  రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీళ్లను క్రమం తప్పకుండా త్రాగాలి దీని వల్ల మీ శరీరం హైడ్రేటెడ్ ఉంటుంది ఇది బరువు తగ్గడానికి ఒక మంచి పద్ధతి.  ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఆహారానికి ముందు 30 నిమిషాలు తర్వాత 30 నిమిషాలు నీటిని తీసుకోకూడదు దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 •  రోజుకి కనీసం ఒక అరగంట శారీరక వ్యాయామం తప్పనిసరి ఇలా చేయడం కుదరని వారు ఇంట్లో మెట్లు ఎక్కి దిగడం, మొక్కలను పెంచడం, పిల్లలతో ఆడుకోవడం,  యోగ ఆసనాలు, డాన్స్ చేయడం లాంటివి చేయవచ్చు.
 •  ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా విడతలవారీగా తినాలి. ఉదయం 9 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ చేయడం, మధ్యాహ్నం 12:30  నుండి 1:00 లోపు  భోజనం చేయడం సాయంకాలం 8 గంటల లోపు ఆహారాన్ని  తీసుకోవడం వంటివి చేయాలి.   సాయంకాల సమయంలో అన్నానికి బదులుగా పండ్లు, కూరగాయలు, క్యారెట్ వంటి  త్వరగా జీర్ణమయ్యే పదార్ధాలను తీసుకోవడం ఉత్తమం.
 • పీచు పదార్థాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
 •  డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి దీని వలన శరీరానికి కావలసిన న్యూట్రీషియన్ అందుతుంది.
 •  అధిక బరువు తగ్గడానికి గ్రీన్ టీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇది అధిక బరువును తగ్గించడానికి మంచి ఆరోగ్యాన్ని  అందించడానికి ఈ గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.
 •  ఉదయం సమయంలో టిఫిన్ గా ఇడ్లీ, వడ, గారె, అట్టు లాంటి టిఫిన్స్ కాకుండా మొలకెత్తిన  గింజలు తింటే కొలెస్ట్రాల్ ను అదుపులో  ఉంటుంది. వీటిలో విటమిన్ ఏ ఏ బి సి డి ఈ పొటాషియం ఇనుము  కాల్షియం మాంసకృతులు, పీచు పదార్ధాలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు అదుపులో ఉంటుంది.  వీటిని తీసుకోలేని వాళ్ళు ఒట్స్ ని కూడా బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.
 • తగినంత నిద్ర పోవాలి. ప్రతి ఒక్కరికీ కనీసం 8 గంటలు నిద్ర తప్పనిసరి.
 • అలాగే ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ని పూర్తిగా మానేయలి.

Click Here for Video

ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తూ మంచి  ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవర్చుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు ఆరోగ్యవంతంగా నాచురల్గా తగ్గించుకోవచ్చు.

how to lose weight fast

 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a comment