ప్రెగ్నెన్సీ తో ఉన్నవాళ్లు కూడా తింటున్నారా?
అయితే ఏమౌతుందో ఒకసారి చూడండి..
బలపాలు, మట్టి, బియ్యం, చాక్ పీస్ లు ఎక్కువమంది బాగా తింటూ ఉంటారు 100 మందిలో 80 నుండి 90 మంది ఈ రోజుల్లో వీటి కి బానిసలవుతున్నారు. మగవారికి సిగరెట్ మద్యం ఎలానో ప్రస్తుతం కొంత మంది ఆడవారికి, పిల్లలకి ఈ బలపాలు మట్టి బియ్యం చాక్పీసులు అలా అయ్యాయి. వీటిని తినకుండా ఉంటే వారికి ఆ రోజు ఏదోలా ఉండటం, ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వడం లాంటివి ఆనిపిస్తూ ఉంటాయి. దీనికి అర్థం వారు ఈ అలవాటుకి బానిస అయ్యారు అని. కొంతమంది అయితే రోజుకి మూడు నుండి నాలుగు పెట్టెలు బలపాలు తినే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అని తెలిసినా వాటిని తినడం మానలేక వాటికి మరింత బానిసలవుతున్నారు.
మరికొంతమంది మానాలి అని అనుకున్నా నా మానడానికి రెండు మూడు రోజులు ప్రయత్నించినా గాని మానలేక ఇంకా ఎక్కువ తినేస్తుంటారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే వీరు పీక అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ సమస్య వల్ల ఎక్కువగా వీటిని తింటూ ఉంటారు ఇంకా జింక్ ఐరన్ తక్కువగా ఉన్న. ఓ సి డి ఉన్నవారు, సరైన పోషకాలు, విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోకపోయినా, ప్రెగ్నెంట్ గా ఉన్నవారు ఎక్కువగా వీటిని తింటూ ఉంటారు.
బలపాలు, చాక్ పీస్, మట్టి, బియ్యం విష పదార్థాలు కాకపోయినా చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి ఆరోగ్యం అనేది వీటివల్ల అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటి వల్ల కలిగే కొన్ని ఆరోగ్య సమస్యలు తెలుసుకుందాం
- జీర్ణ సమస్యలు వస్తాయి
- కడుపు నొప్పి, విరోచనాలు
- వివిధ దంత సమస్యలు వస్తాయి
- కడుపులో ఏలిక పాములు, నులి పురుగులు పెరుగుతాయి
- మలబద్ధకం సమస్య వస్తుంది
- ఆకలి తగ్గిపోతుంది
- రక్తం కలుషితమై రక్త శాతం తగ్గిపోతుంది
- బియ్యం తినడం వల్ల పాండు రోగం అనే సమస్య వస్తుంది
గర్భంతో ఉన్న వాళ్ళు వీటిని తింటే ఏమౌతుంది?:
గర్భందాల్చిన వాళ్ళు, పాలిచ్చే తల్లులు బలపాలు, మట్టి, చాక్ పీస్, బియ్యం వంటివి తినడం వల్ల నష్టాలు వేరేలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల సరైన పోషకాహారం తీసుకోరు, తీసుకోవాలి అనిపించదు దీనివల్ల సరిగ్గా ఆకలి వేయక పోషకాహార లోపం వస్తుంది. దీనివల్ల పుట్టబోయే పిల్లల మంచిది కాదని, భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి గర్భంతో ఉన్న వాళ్ళు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.
How to Stop eating slate pencil
పిల్లలు వీటిని తింటే ఏమౌతుంది?:
పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటూ వీటికి బానిసలుగా మారుతూ ఉంటారు కాబట్టి వారిపట్ల జాగ్రత్త వహించడం వారి నడవడిక ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండడం చాలా అవసరం. ఒకవేళ ఈ అలవాటుకు వారు బానిస అయ్యారు అని గ్రహిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని వారు ఈ అలవాట్లను మానేల చేయాలి. లేదంటే భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు మరువకూడదు. వీటిని పిల్లలు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ మార్పులు వచ్చి పిల్లలు బలహీనంగా తయారవడం, ప్రతి చిన్నదానికి భయపడటం, అలజడి, మానసిక ఆందోళనకు గురవుతారు.
వీటిని తినడం మానాలంటే ఏం చేయాలి?:
How to Stop eating slate pencil
బలపాలు తినాలి అనే ఆలోచన రాకుండా నిత్యం ఏదో ఒక పనిచేస్తూ ఉండటం, వాటిని మీ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా చూసుకోవడం, అవి తినాలి అనిపించినప్పుడు ఏదో ఒక పౌష్టికాహారం అనగా పండ్లు అరటి పండ్లు యాపిల్ ఇలాంటివి ఏదో ఒకటి తీసుకోవడం, ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసి కూర్చోవడం మాట్లాడుతూ సమయం గడపడం వంటివి చేస్తూ ఉండాలి. మొదటి కొంచెం కష్టంగా అనిపించినా రాను రాను ఈ అలవాట్లకు దూరమవుతారు. కొన్ని రోజులు ఇలా చేసిన తరువాత తేడా మీకే అంతమై వాటికి దూరంగా ఉండాలి అనే ఆలోచన మీ మనసులో బలంగా పాతుకు పోతుంది తద్వారా మీరు బియ్యం, బలపాలు, మట్టి, చాక్ పీస్ లు వంటి వాటిని తినే చెడు అలవాటును పూర్తిగా మానేస్తారు. ఇక పిల్లల్లో కూడా ఇదేవిధంగా వాటికి దూరంగా ఉండేలా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలు వీటికి దగ్గరగా ఉండడం వల్ల వారు ఈ అలవాటును మానుకోవడం మరింత కష్టమవుతుంది కాబట్టి వారికి వీటి వల్ల కలిగే దుష్ప్రభావాలను అర్థమయ్యేలా వివరించి అది తినాలి అనిపించినప్పుడు అల్లా ఏదో ఒక పౌష్టికాహారం అయినటువంటి పండ్లు తినమని వారికి నిరంతరం ఏదో ఒక పౌష్టిక చిరు తిండిని వారి దగ్గర ఉంచి వాటినే తినమని చెప్పాలి. ఈ విధంగా చేస్తే ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండవచ్చు.
Nice story 😄😄
Nice
Baga chepperu..
Baga chepparu