joint Pain Remedies

joint Pain Remedies | మోకాళ్ళ నొప్పులతో,కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?

మోకాళ్ళ నొప్పులతో, కీళ్లనొప్పులతో, బలహీనతతో బాధపడుతున్నారా?
మన శరీరంలో ఎక్కువగా వాడే ముఖ్యమైన అవయవం మోకాలు. అయితే నడుస్తున్నప్పుడు, పరిగెడుత్తున్నప్పుడు అలాగే మెట్లు దిగేటప్పుడు,ఎక్కేటప్పుడు ఎక్కువగా చాలా మందికి వయసు పెరిగే కొద్ది నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది చాలామంది లక్షల్లో మోకాళ్ళ నొప్పులు,కీళ్లనొప్పులకు ఆపరేషన్ చేయించుకున్నట్లు ఒక అధ్యయనంలో తెలిసింది. అయితే ఇదివరకటి కాలంలో అయితే 60,70 ఏళ్ళు వచ్చిన తర్వాత కీళ్ల నొప్పులు,మోకాళ్ళనొప్పులతో బాధపడేవారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో 30 ఏళ్లు దాటిన వాళ్ళ దగ్గరనుంచి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు (joint Pain),బలహీనతతో బాధపడుతున్నారు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల, అలాగే బయట ఫుడ్స్ ,ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నాసరే ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి.. కాబట్టి ఎవరైతే ఈ సమస్యలతో బాధ పడుతున్నారో వాళ్ళు ఈ విధంగా ఇంటి చిట్కా ఫాలో అవ్వండి..

మోకాళ్ల నొప్పులను,కీళ్లనొప్పులను, బలహీనతలు,తిమ్మిర్లు పోగొట్టే ఇంటి చిట్కా:-
*ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు పోసుకోండి.
*తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు(Fenugreek) వేసుకోవాలి. మెంతులను వాడడం వల్ల మన శరీరంలో ఉన్న ఎటువంటి నొప్పులు అయినా సరే అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మోకాలు నొప్పులు,కీళ్ళ నొప్పులు చాలా త్వరగా ఉపశమనం లభించడానికి ఉపయోగపడతాయి. అలాగే బలహీనతను, తిమ్మర్లను పోగొట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు తిమ్మిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి నరాల్లో ఉన్న ఎటువంటి సమస్యనైనా పోగొట్టడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి.
*తర్వాత మీరు ఒక స్పూన్ వరకు జీల్లకర్ర వేసుకోండి. జీల్లకర్ర కూడా మన శరీరంలో ఉన్న ఎటువంటి అనారోగ్య సమస్యలు పోగొట్టడానికి, అలాగే నొప్పుల్ని, బలహీనతను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
*తర్వాత శుభ్రంగా కడిగిన పుదీనా ఆకుల్ని ఒక 10 వరకు వేసుకోవాలి. పుదీనా కూడా అనారోగ్య సమస్యలు పోగొట్టడానికి ఉపయోగపడుతుంది.
*అలాగే తర్వాత బిర్యానీ ఆకులను ఒక 2,3 వరకు శుభ్రంగా కడిగి వేసుకోండి. బిర్యానీ ఆకులో ఉండే పోషకాలు మన శరీరంలో ఉన్న నొప్పులను,బలహీనతను పోగొట్టి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
*ఇప్పుడు వీటినన్నిటినీ వేసుకున్న తర్వాత 5 నిముషాలు బాగా మరిగించాలి.
*5 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాసులోకి వడపోసి తీసుకోండి.
*తర్వాత మీ టేస్ట్ కోసం కావాలంటే ఒక స్పూన్ తేనెను కలుపుకోవచ్చు.
(డయాబెటిస్ వాళ్లయితే తేనెను కలుపుకోకుండా తాగాలి)
ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న నొప్పులు(joint Pain) తిమ్మిర్లు బలహీనత పోతుంది.
గమనిక:-
ఈ చిట్కాను ఫాలో అయ్యే ముందు డాక్టర్ని సంప్రదించి ఫాలో అవ్వండి.

Remove Dandruff Click Here

Leave a Comment

Your email address will not be published.