ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా మంది చిన్న వయస్సు నుంచి కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. ఎక్కువగా ఈ సమస్య అనేది సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ కీళ్లనొప్పులు బయటపడతాయి. మన అమ్మమ్మల కాలం లో మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చిన తరువాత కీళ్లనొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడున్న రోజుల్లో మనం తీసుకునే ఆహారం వల్ల సరైన విటమిన్స్ లేకపోవడం వల్ల 30 సంవత్సరాలకు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. అలాగే ఒంట్లో నీరు ఎక్కువగా వస్తుంది. శరీరంలో వ్యర్థమైన నీరు బయటకు వెళ్ళకుండా, లోపల ఉండటం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు కీళ్లనొప్పులను, ఒంట్లో ఉన్న వ్యర్థమైన నీటిని బయటికి పంపడానికి ఒక మంచి ఇంటి చిట్కా చూద్దాం.

ఇంటి చిట్కా:-
*ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వరకు నీటిని తీసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనా అనేది కీళ్లనొప్పులను పోగొట్టడానికి, అలాగే శరీరంలో ఉన్న అదనపు నీటిని బయటకు పంపించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
*తరువాత కిస్ మిస్ లను 5 నుండి 10 వరకు వేసుకోవాలి. కిస్మిస్లు అనేవి కీళ్ళనొప్పులను పోగొట్టడానికి అలాగే ఒంటిలో ఎక్కడ నొప్పి ఉన్న పోగొట్టి శక్తిని అందించడానికి, అలాగే శరీరానికి కావాల్సిన విటమిన్స్ అందించడానికి బాగా ఉపయోగపడుతుంది.
*అలాగే తరువాత లవంగాలను 5 నుండి 10 వరకు వేసుకోండి. లవంగాలులో ఉండే విటమిన్స్ కీళ్ల నొప్పులను పోగొట్టి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వీటినన్నిటిని వేసుకొని బాగా మరిగించుకోవాలి.
*బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గ్లాసులోకి వడపోసుకొని తీసుకోండి.
*ఈ విధంగా తయారు చేసిన నీటిని ఉదయం పరగడుపున బ్రష్ చేసిన తర్వాత తాగితే చాలా రకరకాల అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉండొచ్చు.
గమనిక:-
బాలింతలు, ఎక్కువ కాలం నుంచి మందులు వాడే వారు, గర్భవతులు డాక్టర్ సలహా తీసుకొని ఈ చిట్కా పాటించండి.