ప్రస్తుత ఉన్న కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. మలబద్దకం సమస్య ప్రతి 10 మందిలో కనీసం 7గురు బాధపడుతున్నారు. అయితే ఈ మలబద్దకాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేయడం వల్ల మరెన్నో అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లు అవుతుంది. అయితే ఇప్పుడు మలబద్దకం రావడానికి కారణాలు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక ఇంటి చిట్కాలు చూద్దాం.

మలబద్దకం రావడానికి ముఖ్య కారణాలు ఏంటో తెలుసుకుందాం..
*చాలామంది నీటిని చాలా తక్కువగా తాగుతూ ఉంటారు దీనివల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది
*చాలామంది ఆయిల్ ఫుడ్స్, జంక్‌ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల
*ధూమపానం చేయడం వల్ల
*మద్యపానం చేయడం వల్ల
*వ్యాయామం చేయకపోవడం వల్ల
*టీ,కాఫీలు,వేపుళ్ళు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువగా మలబద్ధకానికి కారణాలు.
మలబద్దకం రాకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు:-
*కచ్చితంగా శరీరానికి సరిపడా నీటిని తాగాలి. రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి
*వ్యాయామం చేయాలి
*బయట దొరికే ఆహారాన్ని పూర్తిగా మానేయాలి.
*ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
*పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. (ఆకుకూరలు,అరటిపండు, బత్తాయి,పైనాపిల్, జామ) వీటిని తినడం వల్ల మల విసర్జన సాఫీగా జరుగుతుంది.
మలబద్దకానికి ఇంటి చిట్కా:-
*ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకొని,ఒక పావు టీ స్పూను ధనియాల పొడిని తీసుకోవాలి. ధనియాలపొడి అనేది మలబద్ధకాన్ని పోగొట్టడానికి అలాగే మల విసర్జన సాఫీగా జరిగేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
*తర్వాత ఒక పావు టీ స్పూను వరకు అల్లం రసాన్ని కలుపుకోవాలి. అల్లం కూడా గ్యాస్,మలబద్ధకం సమస్యను అరికట్టడానికి బాగా సహాయపడుతుంది. అలాగే తిన్నది త్వరగా జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది.
*తర్వాత ఒక అర టీ స్పూను వరకు తేనే కలుపుకోవాలి. డయాబెటిస్ వాళ్లయితే తేనెను కలుపుకోక్కర్లేదు.
*ఇప్పుడు వీటినన్నిటినీ కూడా బాగా కలపాలి. ఇప్పుడు మన రెమిడి అనేది రెడీ అయింది.
*ఈ విధంగా తయారుచేసింది ఒక అర టీ స్పూను వరకు మీకు ఎప్పుడైతే మలబద్ధకం సమస్య ఉంటుందో అప్పుడు తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను పోగొట్టుకోవచ్చు.
గమనిక:-
బాలింతలు,గర్భవతులు,ఎక్కువ కాలం నుంచి మందులు వాడే వారు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకొని ఈ టిప్ ను ట్రై చేయండి.