Natural Homemade Soap | ఇంట్లోనే స్కిన్ని అందంగా మార్చే సబ్బు నీ తయారు చేసుకోండి

ముఖానికి ఏ సబ్బు వాడాలో తెలియట్లేదా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే.. బయట కొనుక్కుని కొన్ని సబ్బుల్లో కెమికల్స్ కలవడం వల్ల ముఖం మీద మచ్చలు, మొటిమలు, నలుపు ఎక్కువైపోతుంది. అలాగే మొఖం చాలా డల్ గా తయారవుతుంది. దీనివల్ల చాలామంది ఏ సోప్ వాడితే ముఖం తెల్లగా అవుతుందో, అందంగా మారుతుందో తెలియక బాధపడుతూ ఉంటారు. ముఖవర్చస్సు పెంచుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్లడం,లేదంటే ఖరీదైన సబ్బుల్ని, క్రీమ్స్ వాడడం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు డబ్బులు ఖర్చు పెట్టిన ఫలితం లేకపోవడం వల్ల చాలా ఫీల్ అవుతారు. కాబట్టి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే సహజసిద్ధమైన సబ్బును తయారుచేసుకొని వాడడం వల్ల ముఖం మీద ఉన్న అన్ని సమస్యలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. కాబట్టి ఇంట్లోనే నాచురల్ గా సబ్బును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఇంట్లోనే సబ్బును ఎలా తయారు చేసుకోవాలి?:-
*ముందుగా మీరు బాగా ఎర్రగా పండిన టమాటాను నీటితో కడిగి చిన్న ,చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల చర్మం మీద ఉన్న మృతకణాలు, మచ్చలు, నలుపు, జిడ్డు చర్మం తొలగిపోయి కాంతివంతంగా మెరిసిపోతుంది.
*తర్వాత ఇంట్లో పెంచుకునే కలబంద గుజ్జును ఒక స్పూను వరకూ కలుపుకోవాలి. ఇంట్లో పెంచుకునే కలబంద లేకపోతే మార్కెట్లో దొరికే నాచురల్ అలోవెరా జెల్ను ఒక స్పూను వరకూ కలుపుకోవచ్చు. కలబంద ముఖం మీద ఉన్న ఎటువంటి సమస్యనైనా పోగొట్టి ముఖం అందంగా, తెల్లగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది.
*తరువాత ఒక స్పూన్ బియ్యప్పిండిని వేసుకోవాలి. బియ్యప్పిండి ముఖం మీద ఉన్న జిడ్డును పోగొట్టి, మొటిమలు, మచ్చలు రాకుండా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖం కూడా చాలా అందంగా మారుతుంది.
*తరువాత గంధమును ఒక స్పూన్ వరకు కలుపుకోవాలి. గంధం కూడా సౌందర్యాన్ని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు వీటినన్నిటిని మిక్సీ జార్లో కి వేసుకొని మెత్తటి పేస్టులాగా తయారుచేసుకుని పక్కన పెట్టుకోండి.
*తరువాత ఏదైనా గ్లిజరిన్ సోప్ ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
*తరువాత ఆ గిన్నెను డైరెక్టుగా స్టవ్ మీద పెట్టకుండా ఒక గిన్నెలో వేడి నీళ్లు చేసుకొని ఆ గిన్నెలో ఈ గిన్నె పెట్టి వేడి చేసుకోవాలి. దీనిని డబల్ బాయిలింగ్ ప్రాసెస్ (Double Boiling Process) అంటారు.
*గ్లిజరిన్ సోప్ లిక్విడ్ లాగా మారిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి.
*పేస్ట్ను వేసిన తర్వాత ఉండలు ఉండలుగా లేకుండా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
*తరువాత మీకు ఏ ఆకారంలో అయితే సోప్ కావాలి అనుకుంటున్నారో ఆ గిన్నెను తీసుకొని ముందుగా దానికి ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాయడం వల్ల సోపు ఈజీగా బయటకు వస్తుంది. ఆయిల్ రాసిన తర్వాత వేడి చేసుకున్న పేస్ట్ ను గిన్నెలో పోసుకొని కనీసం 2 గంటలు పక్కన పెట్టుకోవాలి.
*2 గంటల తర్వాత చాకుతో గాని స్పూన్ తో గాని సబ్బును బయటికి తీసుకోవలి.
*ఇప్పుడు మన నాచురల్ సోప్ రెడీ అయింది.
* దీన్ని మీరు నార్మల్ సోప్ ని ఎలా వాడుతారో అదేవిధంగా వాడుకోవచ్చు..

Leave a Comment

Your email address will not be published.