మార్కెట్లో దొరికే ఖరీదైన లిప్ స్టిక్స్, లిప్ బామ్స్ వాడి మీ పెదాలను పాడు చేసుకుంటున్నరా? ఎన్ని చేసినా మీ పెదాల సౌందర్యాన్ని పెంచలేకపోతున్నాయా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే.. పెదాలు నల్లగా ఉండడానికి, పగలడానికి కొన్ని కారణాలు తెలుసుకుందం.. అలాగే పెదాలను ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా గులాబీ రంగులోకి(Pink lips tip) ఎలా మార్చుకోవచో చూద్దాం..
పెదాలను నల్లగా నిర్జీవంగా మారడానికి కొన్ని కారణాలు:-
*హార్మోన్ల అసమతుల్యత వల్ల
*అలర్జీ కారణం వల్ల
*ధూమపానం
*కేఫైన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల
*కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల
పెదాలు గులాబి రంగులోకి మార్చడానికి ఇంటి చిట్కాలు:-
1Step:-
*ముందుగా మీరు బీట్రూట్ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకొని పేస్టులాగా తయారు చేసుకోండి. బీట్ రూట్ అనేది సహజంగా పెదాలను గులాబీ రంగులోకి మార్చడానికి అద్భుతంగా పని చేస్తుంది. అలాగే పగిలిన పెదాలు కూడా మృదువుగా మారుస్తుంది.
*తరువాత కొంచెం పేస్ట్‌ని ఫిల్టర్ చేసి జ్యూస్‌ను తీసుకొని పక్కన పెట్టుకోండి.
*తర్వాత ఒక గిన్నెలో బీట్రూట్ పేస్ట్ ను తీసుకోండి. అలాగే ఒక స్పూన్ పంచదార వేసుకుని రెండింటినీ బాగా కలపాలి.
*ఈ విధంగా తయారుచేసుకున్న తర్వాత పెదాలపై ఒక 5 నిమిషాలు సున్నితంగా మర్దన చేయాలి.5 నిమిషాలు మర్దన చేసిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోండి.
2nd Step:-
ఇంట్లోనే లిప్ బామ్‌ను తయారు చేసుకుందాం..
*ముందుగా మీరు ఒక గిన్నెలో బీట్రూట్ రసాన్ని తీసుకోండి.
*తరువాత ఒక స్పూన్ కొబ్బరినూనె(coconut oil) గానీ బాదంనూనెగాని కలుపుకోవాలి.
*అలాగే విటమిన్ ఇ ఆయిల్ ఒకటి వేసుకొని బాగా కలుపుకొవాలి. ఆయిల్ ని కలపడం వల్ల గరుకు గా ఉన్నాం పెదాలు మృదువుగా మారతాయి.
*తరువాత వ్యాజిలైన్‌ను ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి.
* ఇంట్లోనే నాచురల్ లీప్ బామ్ తయారవుతుంది.
*ఈ విధంగా తయారు చేసిన లిప్ బామ్ని ప్రతిరోజూ రాసుకుని పడుకోవడం వల్ల, కచ్చితంగా మీ పెదాలు గులాబీ రంగులోకి (Pink lips tip) మారతాయి. చాలా అందంగా తయారవుతాయి.