Sleeping Problems: సరిపడా నిద్ర లేకపోతే ఎంత ప్రమాదానికి గురవుతారో తెలుసా?

నేడు  సగటు మనిషి ఎదురుకుంటున్న  సమస్యలలో ప్రధాన సమస్య  సమయానికి నిద్రపోవకపోవడం..తగినంత నిద్ర లేకపోవడం.. (Sleeping Problems) ఈ రెండు సమస్యలకి ప్రధాన కారణాలు పని ఒత్తిళ్లు, తగినంత విశ్రాంతి లేకపోవడం,కుటుంబ సమస్యలు, ఆనారోగ్య సమస్యలు,ఆహారపు అలవాట్లు  అనుసరించకపోవడం,  వ్యక్తిగత సమస్యలు,టీవీలు ,కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయం గడపటం, వంటివి సగటు మనిషికి నిద్ర లేకపోవడానికి కారణాలు..

ఈ నిద్ర లేకపోవడం అనే సమస్య అనేక దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి..ప్రధానంగా డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు,మానసిక సమస్యలు రావడం , అధికంగా బరువు, నీరసం, తలనొప్పి, తలతిరగడం, మతిమరుపు, అలసట, అశాంతి లాంటివి పెరిగిపోతాయి.

Sleeping Problems in telugu
Sleeping Problems

ఇవే కాకుండా సమయానికి నిద్ర లేకపోవడం వలన మనలోని జ్ఞాపక శక్తిని మనము కోల్పోతాము.. ఎందుకంటే తగినంత నిద్ర  లేకపోవడం వలన మనలోని నాడీ వ్యవస్థ తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపుతుంది. తగినంత  నిద్ర లేకపోవడం  వలన నాడీ వ్యవస్థ ఒత్తిడికి లోనై  మనలోని  మెదడు పనితీరు పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.

అంతేకాకుండా ఎక్కువ సమయం నిద్రపోకుండా  మెలుకువగా  ఉండటం వలన మన కంటి కింద  నల్లటి డార్క్ సర్కిల్స్  వస్తాయి..  ఈ  ఈ నల్లటి  డార్క్ సర్కిల్స్ ఎక్కువ మందిలో  కనిపిస్తూ ఉంటాయి..  ఇవి ఎక్కువ మందిలో రావటానికి కారణం తగినంత నిద్ర లేకపోవడమే.

నిద్ర లేకపోవడం అనేది మన  శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పై  తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మనలో  రోగనిరోధక వ్యవస్థ దెబ్బ తినడం వలన క్రమంగా  మనం  అనేక వ్యాధుల బారిన పడతాము..ఎందుకంటే  మనల్ని ఆరోగ్యంగా  ఉంచడంలో  మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది

అంతేకాకుండా సరైన నిద్ర లేకపోవడం వలన నరాలకు  సంబంధించిన వ్యాధులకు సంబంధించిన వ్యాధులకు మరియు ఇన్ఫెక్షన్లకు గురి  అయ్యే  అవకాశం ఉంది మరియు నిద్ర లేకపోవడం వలన  కారణం లేకుండా తీవ్ర కోపం,  ఉద్రేకం  మరియు తలనొప్పి,  తల తిప్పడం,  భారంగా ఉండటం, లాంటి  సమస్యలు  తలెత్తుతాయి..

నేడు నిద్ర లేని సమస్య  గ్రామీణ  ప్రాంతాలలో ఉండి ప్రజల కంటే పట్టణాలలో ఉండే ప్రజలలో ఎక్కువగా ఉంటుంది ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఆర్థిక పరిస్థితులు, ఎక్కువగా ఇంటర్నెట్  అందుబాటులో ఉండటం వలన పట్టణాల్లో ఉండే ప్రజలు ఎక్కువగా సెల్ ఫోన్లు, కంప్యూటర్లు,   టీవీల కు సమయం కేటాయించడం వలన వారు ఎక్కువగా నిద్రకు దూరమవుతున్నారు.

మనం  పూర్తి ఆరోగ్యంగా ఉండటంలో నిద్ర కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది.. అందుకే మనం  రోజు తగినంత నిద్ర పోవాలి..

Read : How much Water Should we Drink a day

సుఖ నిద్ర కోసం తప్పక పాటించవలసిన విషయాలు:

  •  తగినంత నిద్ర పోవాలంటే  మనం ముందుగా మంచి జీవన శైలిని అలవరచుకోవాలనీ..
  • మంచి ఆహారపు అలవాట్లను పాటించాలని..
  • రోజు వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయడం,  వంటివి  క్రమం తప్పకుండా చేయాలని..
  • సాధ్యమైనంతవరకు  పని ఒత్తిడి లాంటివి  మనపై ఎక్కువగా పడకుండా చూసుకోవాలని,
  •  టైంకి నిద్రపోవడం టైం కి లేవడం అలవాటు చేసుకోవాలని,
  • నిద్రపోయే సమయంలో రూములో సాధ్యమైనంత తక్కువ   వెలుతురు ఉండేలా చూసుకోవాలని,
  •  నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం  చేస్తే నిద్ర  త్వరగా పడుతుందని,
  •  సెల్ ఫోన్లు, కంప్యూటర్లు,  టీవీలకు, ఇంటర్నెట్  సాధ్యమైనంత దూరంగా ఉండటమే   మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

For Health And Beauty Related Videos Click Here.

  •  
  •  
  •  
  •  
  • 0
  •  
  •  

Leave a comment