Sobi Machalu Thaggalante

Sobi Machalu Remedies : బొల్లి/తెల్ల మచ్చలకి మంచి చిట్కా

ప్రస్తుతం ఈ రోజుల్లో చాలామంది తెల్లశోబి మచ్చల(Sobi Machalu)తో బాధపడుతున్నారు. ఇంగ్లీషులో దీన్ని విటిలిగో అని అంటారు. ఇది అంటువ్యాధి కాదు.ఈ సమస్య వస్తె అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే మొదట్లో కొద్దిమేర మొదలై క్రమంగా శరీరమంతా వ్యాప్తి చెందుతాయి. ఈ బొల్లి అనేది చర్మానికి సంబంధించిన వ్యాధి. ఈ బొల్లి అనేది రావడానికి ముఖ్య కారణం మన శరీరంలో మెలనిన్ అనే రంగ్ ఇచ్చే పదార్థం వల్ల మేనిఛాయ వస్తుంది. అయితే మెలనోసైట్స్ అనే కణాలు పనిచేయకపోవడం వల్ల రంగు ఏర్పడదు. అయితే రోగ నిరోధక శక్తి మెలనోసైట్స్ మీద దాడి చేయడం వల్ల బొల్లి అనే సమస్య ఎక్కువగా వస్తుంది. చర్మంలో ఉండే మెలనిన్ కణాలు దెబ్బతిన్నాయి అంటే చర్మానికి హాని జరుగుతుంది. చర్మం మీద ఉన్న రంగు నెమ్మదిగా కోల్పోయి తెల్లగా మారి ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య అనేది శరీరంలో ఎక్కడైనా మొదలు కావచ్చు. ఈ సమస్య అనేది స్త్రీ, పురుషులిద్దరిలోని సర్వసాధారణంగా కనిపించి సమస్యల్లో ఒకటి. ఈ మచ్చలు తెల్లగా ఉండటం వల్ల వీటిని తెల్లమచ్చలు అంటాము. అలాగే కొందరిలో తెలుపుతోపాటు గోధుమరంగు కలిసి ఉండవచ్చు. కాబట్టి ఈ సమస్యను అశ్రద్ధ చేయకుండా మొదట్లోనే ఇంటి చిట్కాలు వాడడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కాబట్టి ఇప్పుడు బొల్లి సమస్య రావడానికి ముఖ్య కారణాలు, అలాగే ఒక ఇంటి చిట్కా చూద్దాం.

తెల్ల మచ్చలు రావడానికి ముఖ్య కారణాలు:-
*ఒత్తిడి వల్ల
*వంశపారంపర్యంగా
*సున్నితమైన చర్మం ఉండటంవల్ల
*పోషకాహార లోపం వల్ల
*గ్లూటాతియోన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల

తెల్లమచ్చలకు ఇంటి చిట్కా:-
*ముందుగా మీరు తులసి(Tulasi) ఆకులను ఒక పది వరకు తీసుకుని శుభ్రంగా నీటితో కడిగి మెత్తగా పేస్టులాగా తయారుచేసుకుని తీసుకోండి. తులసి ఆకులను చర్మ సమస్యలను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. చర్మంమీద ఉన్నా తెల్లశోభిమచ్చలను చాలా ఎఫెక్టివ్ గా పోగొడుతుంది. ఎటువంటి చర్మ సమస్యనైనా పోగొట్టుకుంది.
*తరువాత కస్తూరి పసుపుని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. పసుపు వాడడం వల్ల కూడా చర్మం మీద ఉన్న బ్యాక్టీరియా, క్రిములు పోతాయి. అలాగే చర్మం మీద ఉన్న బొల్లి సమస్యలు పోగొట్టడానికి కూడా పసుపు అద్భుతంగా పనిచేస్తుంది.
*తరువాత ఆవ నూనెను ఒక స్పూను వరకు కలుపుకొని పేస్టు లాగా తయారు చేసుకోవాలి. ఆవనూనె కూడా తెల్ల మచ్చలను పోగొట్టడానికి బాగా పనిచేస్తుంది. అవును ని వాడడం వల్ల ఫలితం కూడా త్వరగా కనిపిస్తుంది.
*తరువాత కర్పూరం బిళ్లను ఒక 3,4 వరకు పౌడర్ చేసుకొని కలుపుకోవాలి. కర్పూరం కూడా చర్మ సమస్యలు పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన రెమిడి రెడీ అయింది.

తయారుచేసుకున్న రెమిడీ ని ఎలా వాడాలి?:-
*ముందుగా దుమ్ము,ధూళి ఏమీ లేకుండా ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత సమస్య ఎక్కడుందో అక్కడ మాత్రమే ఈ ప్యాక్ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత కనీసం ఒక 40 నిమిషాలు ఉంచుకొని మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2రోజులు చేయడం వల్ల బొల్లి మచ్చల(Sobi Machalu) సమస్య తగ్గుతుంది.

For Irregular Periods Solution Click Here

Leave a Comment

Your email address will not be published.