పంటి నొప్పితో బాధపడుతున్నారా? వెంటనే నొప్పి నుండి ఉపశమనం పొందాలని భావిస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
ఎక్కువ మందిని వేధించే సమస్య పంటి నొప్పి. ఈ సమస్య ఎక్కువగా దంతాలు పుచ్చిపోవడం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, దంతాల్లో పగుళ్ళు రావడం వల్ల, అలాగే చిగుళ్ల వ్యాధులు వల్ల ఇలాంటి కారణాల వల్ల పంటి నొప్పి ఎక్కువగా వస్తుంది. దీంతో నొప్పిని భరించలేక చాలా మంది మందులు వేసుకుంటూ ఉంటారు. కానీ అలా మందులు ఎక్కువసార్లు వేసుకున్న ప్రమాదమే. ఒక్కసారి నొప్పి వస్తే చాలాసేపటి వరకు ఆ నొప్పి పోదు. కాబట్టి హాస్పటల్‌కి పద్దాక వెళ్లడం కుదరకపోయినా వాళ్లు ఈ ఇంటి చిట్కాలు పాటించడం వల్ల వెంటనే పంటి నొప్పి నుండి ఉపశమనం (Tooth pain relief) లభిస్తుంది..
పంటి నొప్పి నుండి ఉపశమనం లభించిడానికి ఇంటి చిట్కాలు:-
1St Step:-
*ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వరకు మంచి నీటిని పోసుకోవాలి.
*తరువాత నీళ్ళు కొంచెం వేడి అయిన తర్వాత చిటికెడు సాల్ట్(Salt) ని వేసుకోండి. సాల్టు నోట్లో ఉన్న క్రిములను,బ్యాక్టీరియాలను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పంటినొప్పి నుండి ఉపశమనం లభించడనికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
*5 నిమిషాలు ఈ నీల్లు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.
*తరువాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని ఒక గ్లాసు లోకి తీసుకోవాలి.
*ఈ నీటితో ఒక రెండు,మూడు సార్లు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక ఐదు నిమిషాలు పుక్కిలించాలి. ఇలా పుక్కిలించడం వల్ల దంతాలు లోపల ఉన్న వ్యర్ధాలు,క్రిములు బయటికి వెళ్లిపోతాయి. ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. కాబట్టి రోజుకి రెండు సార్లైనా పుక్కిలించడం చాలా మంచిది.
2Nd Step:-
*ముందుగా మీరు పుదీనా ఆకులను శుభ్రం చేసుకొని ఒక గుప్పెడు వరకు తీసుకోండి. పుదీనా అనేది నోటిని శుభ్రం చేయడానికి, అలాగే చిగుళ్ల వ్యాధులను నయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత పుదీనాని మిక్సీ జార్‌లోకి వేసుకోండి.
*తరువాత పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను ఒక 10 వరకు తీసుకోండి. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీబయోటిక్ గుణాలు పంటినొప్పి నుండి వెంటనే ఉపశమనం లభించడనికి బాగా ఉపయోగపడుతుంది.
*తరువాత ఈ వెల్లుల్లిని కూడా మిక్సీ జార్‌లోకి వేసి పుదీనాను, వెల్లుల్లి రెండిటినీ మెత్తగా పేస్ట్‌లాగా తయారు చేసుకోండి.
*తర్వాత ఈ పేస్ట్ ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి.
*ఈ విధంగా తయారు చేసిన ఈ పేస్ట్‌ని మీకు ఎక్కడైతే పంటినొప్పి ఉంటుందో,అలాగే పుచ్చిపోయిన పన్ను ఉంటుందో అక్కడ పెట్టేసి ఒక రెండు,మూడు నిమిషాలు ఉంచాలి. ఇలా రెండు,మూడు సార్లు చేయండి. ఇలా చేయడం వల్ల పంటినొప్పి నుండి ఉపశమనం (Tooth pain relief) లభిస్తుంది.